5
అతను అంటాడు
1 నా ప్రియ సఖీ, నా ప్రియ వధూ, నేను నా తోటలో ప్రవేశించాను,
నేను నా బోళం సుగంధ ద్రవ్యాలను ఏరుకున్నాను,
తేనె తాగాను తేనె పొర తిన్నాను
నేను నా మధుక్షీరాలు సేవించాను.
ప్రేయసీ ప్రియులతో స్త్రీలు అంటారు
ప్రియాతి ప్రియ నేస్తాల్లారా తినండి, తాగండి!
ప్రేమను జుర్రి మత్తిల్లండి!
ఆమె అంటుంది
2 నేను నిద్రించానేగాని
నా హృదయం మేల్కొనేవుంది.
నా ప్రియుడు తలుపు తట్టి ఇలా అనడం విన్నాను
“నా ప్రియ సఖీ, ప్రేయసీ నా గువ్వపిట్టా, సుగుణ ఖనీ!
నా తల మంచుతో తడిసింది
నా జుట్టు రేమంచు జడికి నానింది.”
3 “నేను నా వస్త్రం తోలగించాను,
దాన్ని తిరిగి ధరించాలని అనిపించలేదు.
నేను నా పాదాలు కడుక్కున్నాను.
అవి తిరిగి మురికి అవడం ఇష్టం లేక పోయింది.”
4 తలుపు సందులో నా ప్రియుడు చేతినుంచాడు* తలుపు … చేతినుంచాడు లేక, “తలుపు సందునుంచి తన చేతిని లాక్కున్నాడు” తాళానికీ, తాళం చెవికీ ఇది సూచన కావచ్చు. పురాతనమైన కొన్ని తాళం చెవులు చేయి ఆకారంలో ఉండేవి. ఆ తాళం చెవి తలుపు సందులోంచి లోపలికి జారపబచేవి, ఆతాళం చెవికి చెవికి వున్న “వ్రేళ్లు” ప్రత్యేకమైన రంధ్రాల్లోకి పోయి, గడియను ప్రక్కకి నెట్టేవి. ఈ విధంగా తాళం వేయడం, తీయడం జరిగేది.
నేనతని పట్ల జాలినొందాను.† నేనతని పట్ల జాలినొందాను శబ్ధార్థ ప్రకారం, “నా అంతరంగం అతనికోసం స్పందించింది.”
5 నా చేతుల నుంచి జటామాంసి జారగా,
నా వేళ్ల నుంచి జటామాంసి పరిమళ ద్రవం తలుపు గడియ పైకి
జాలువారగా నేను నా ప్రియునికి తలుపు తీయ తలంచాను.
6 నేను నా ప్రియుడికి తలుపు తెరిచాను,
కాని అప్పటికే నా ప్రియుడు వెనుదిరిగి వెళ్లిపోయాడు!
అతడు వెళ్లిపోయినంతనే
నా ప్రాణం కడగట్టింది.‡ నా ప్రాణం కడగట్టింది. అతను మాట్లాడినప్పుడు నా హృదయము అతని వైపు తిరిగెను.
నేనతని కోసం గాలించాను.
కాని అతడు కనిపించలేదు.
నేనతన్ని పిలిచాను,
కాని అతడు బదులీయలేదు.
7 నగరంలో పారా తిరిగేవారు నాకు తారసిల్లారు
నన్ను కొట్టి,
గాయపరిచారు.
ప్రాకారం కావలివారు నా పై
దుస్తును కాజేశారు.
8 యెరూషలేము స్త్రీలారా,
నా ప్రియుడు మీ కంట పడితే చెప్పండి, నీ ప్రియురాలు నీ ప్రేమతో కృంగి కృశించి పోతోందని.
ఆమెకి యెరూషలేము స్త్రీల ప్రశ్నలు
9 అతిలోక సుందరి, ఇతర ప్రియులకంటె నీ ప్రియుని విశేషం ఏమిటి?
ఇతర ప్రియుల కన్న నీ ప్రియుడు వేటివేటిలో ఎక్కువా?
అంతగా ఎక్కువ కనుకనేనా, మాచేత ప్రమాణం చేయించుకున్నావు?
యెరూషలేము స్త్రీలకు ఆమె సమాధానం
10 నా ప్రియుడు కమిలి ప్రకాశించు కాయమ్ము కలవాడు,
పదివేలలోనైన రాణించగలవాడు.
11 మేలిమి బంగారు పోలిన శిరస్సు గలవాడు తుమ్మెద రెక్కలవంటి
నొక్కు నొక్కుల కారునల్లటి శిరో జాలవాడు.
12 అతని కనులేమో సెలయేటి ఒడ్డున ఎగిరేటి గువ్వల పోలు
పాల మునిగిన పావురాల
పోలు బంగారం తాపిన రత్నాల పోలు.
13 అతడి చెక్కిళ్లు సుగంధ ఉద్యానాల
పరిమళ పుష్పరాశుల పోలు
అతని పెదవులు బోళంతో
తడిసిన అత్తరు వారు కెందామరలు.
14 అతని చేతులు వజ్రాలు పొదిగిన
బంగారు కడ్డీల పోలు
అతని కాయము నీలాలు తాపిన నున్నటి
దంత దూలమ్ము పోలు.
15 అతని పాదాలు బంగారు దిమ్మమీది
పాలరాతి స్తంభాల పోలు
అతని సుదీర్ఘ శరీరం లెబానోను పర్వతం మీది
నిటారైన దేవదారు వృక్షాన్ని తలపింపజేయు.
16 ఔనౌను, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు అత్యంత వాంఛనీయుడు,
అతని అధరం అత్యంత మధురం
అతనే నా ప్రియుడు,
నా ప్రాణ సఖుడు.
*5:4: తలుపు … చేతినుంచాడు లేక, “తలుపు సందునుంచి తన చేతిని లాక్కున్నాడు” తాళానికీ, తాళం చెవికీ ఇది సూచన కావచ్చు. పురాతనమైన కొన్ని తాళం చెవులు చేయి ఆకారంలో ఉండేవి. ఆ తాళం చెవి తలుపు సందులోంచి లోపలికి జారపబచేవి, ఆతాళం చెవికి చెవికి వున్న “వ్రేళ్లు” ప్రత్యేకమైన రంధ్రాల్లోకి పోయి, గడియను ప్రక్కకి నెట్టేవి. ఈ విధంగా తాళం వేయడం, తీయడం జరిగేది.
†5:4: నేనతని పట్ల జాలినొందాను శబ్ధార్థ ప్రకారం, “నా అంతరంగం అతనికోసం స్పందించింది.”
‡5:6: నా ప్రాణం కడగట్టింది. అతను మాట్లాడినప్పుడు నా హృదయము అతని వైపు తిరిగెను.