61
సంగీత నాయకునికి తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన.
1 దేవా, నా ప్రార్థనా గీతం వినుము.
నా ప్రార్థన ఆలకించుము.
2 నేను ఎక్కడ ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా,
సహాయం కోసం నీకు మొరపెడతాను.
ఎత్తయిన క్షేమస్థలానికి
నన్ను మోసికొనిపొమ్ము.
3 నీవే నా క్షేమ స్థానం.
నా శత్రువుల నుండి నన్ను కాపాడే బలమైన గోపురం నీవే.
4 నీ గుడారంలో* నీ గుడారంలో యెరూషలేములోని పరిశుద్ధాలయుము లేదా దేవాలయము కట్టుటకు ముందు పరిశుద్ధ గుడారములో దేవుడు ఆరాధింపబడ్డాడు. నేను శాశ్వతంగా నివసిస్తాను.
నీవు నన్ను ఎక్కడ కాపాడగలవో అక్కడ దాక్కుంటాను.
5 దేవా, నేను నీకిస్తానని చేసిన ప్రమాణం నీవు విన్నావు.
కాని నిన్ను ఆరాధించేవారికి ఉన్న సమస్తం నీవద్ద నుండే వస్తుంది.
6 రాజుకు దీర్గాయుష్షు దయచేయుము.
అతన్ని శాశ్వతంగా జీవించనిమ్ము.
7 అతన్ని దేవుని ఎదుట శాశ్వతంగా జీవించనిమ్ము.
నీ నిజమైన ప్రేమతో మరియు విశ్వాసంతో అతనిని కాపాడుము.
8 నేను నీ నామాన్ని శాశ్వతంగా స్తుతిస్తాను.
నేను ప్రమాణం చేసిన వాటిని ప్రతి రోజూ చేస్తాను.
*61:4: నీ గుడారంలో యెరూషలేములోని పరిశుద్ధాలయుము లేదా దేవాలయము కట్టుటకు ముందు పరిశుద్ధ గుడారములో దేవుడు ఆరాధింపబడ్డాడు.