33
మోషే ప్రజలను ఆశీర్వదించటం
దైవజనుడైన మోషే తాను చనిపోకముందు ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చిన ఆశీర్వాదం ఇది. మోషే చేప్పినది;
 
“యెహోవా సీనాయినుండి వచ్చెను.
యెహోవా శేయీరులో ప్రభాత వెలుగులా ఉన్నాడు.
ఆయన పారాను కొండ నుండి ప్రకాశించే వెలుగులా ఉన్నాడు.
యెహోవా 10,000 మంది పరశుద్ధులతో వచ్చాడు.
ఆయన కుడిచేతి వైపున దేవుని గొప్ప గొప్ప మహా సైనికులు ఉన్నారు.
అవును, యెహోవా తన ప్రజలను ప్రేమిస్తాడు.
ఆయన పరిశుద్ధ ప్రజలంతా ఆయన చేతిలో ఉన్నారు.
వారు ఆయన అడుగుజాడల్లో నడుస్తారు.
ప్రతి ఒక్కరూ ఆయన ప్రబోధాలు అంగీకరిస్తారు.
మోషే మనకు ధర్మశాస్త్రం యిచ్చాడు.
అది యాకోబు ప్రజలందరికీ చెందుతుంది.
ప్రజలు, వారి నాయకులు
సమావేశమైనప్పుడు యెషూరూనుకు* యెషూరూనుకు ఇది ఇశ్రాయేలుకు మరో పేరు మంచివాడు లేక సత్యవంతుడు అని దీని అర్థం. రాజు ఉన్నాడు.
యెహోవాయే వారి రాజు.
రూబేనుకు ఆశీర్వాదాలు
“రూబేను మరణించక, జీవించునుగాక!
ఆతని వంశంలో అనేకమంది ప్రజలు ఉందురు గాక!”
యూదాకు ఆశీర్వాదాలు
యూదా వంశం గూర్చి మోషే ఈ విషయాలు చెప్పాడు:
 
“యెహోవా, యూదా నాయకుడు సహాయం కోసం మొరపెట్టినప్పుడు ఆలకించు.
అతణ్ణి తన ప్రజల దగ్గరకు చేర్చు.
ఆతణ్ణి బలంవతుణ్ణి చేయి. అతడు తన శత్రువులను ఓడించటానికి సహాయం చేయి!”
లేవీయులకు ఆశిర్యాదాలు
లేవీని గూర్చి మోషే ఇలా చెప్పాడు.
 
“నీ నిజమైన అనుచరుడు లేవీ ఊరీము, తుమ్మీమునకు ఊరీము, తుమ్మీమునకు దేవుని నుండి తమ ప్రశ్నలకు జవాబులు పొందేందుకు యాజకులు వీటిని ఉపయోగిం చేవారు. కాపలా ఉండేవాడు.
నీ పత్యేక మనిషి వాటిని కాపాడుతాడు.
మస్సా దగ్గర నీవు లేవీ ప్రజలను పరీక్షించావు వాళ్లు
నీ వాళ్లని (నిన్ను ప్రేమించుటకు) మెరీబా మస్సా … మెరీబా సంఖ్యాకాండము 20:1-13 చూడండి. నీళ్ల దగ్గర నీవు రుజువు చేసావు.
లేవీ తన తండ్రి, తల్లిని గూర్చి చెప్పాడు.
‘వారి విషయం నేను లెక్క చేయను’
అతడు తన సొంత సోదరులను స్వీకరించ లేదు.
తన సొంత పిల్లల్ని తెలుసుకో లేదు.
లేవీయులు నీ మాటకు విధేయులయ్యారు
నీ ఒడంబడికను నిలబెట్టారు.
10 యాకోబుకు§ యాకోబు ఇశ్రాయేలు యొక్క మరో పేరు. నీ నియమాలను ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రాన్ని వారు బోధిస్తారు.
వాళ్లు నీ యెదుట ధూపం వేస్తారు.
నీ బలిపీఠం మీద పరిపూర్ణ దహన బలులు అర్చిస్తారు.
 
11 “యోహావా లేవీకి చెందిన వాటిని ఆశీర్వదించు
అతడు జరిగించే వాటిని స్వీకరించు.
అతని మీద దాడి చేసే వాళ్లను నాశనం చేయి.”
బెన్యామీనుకు ఆశీర్వాదాలు
12 బెన్యామీను గూర్చి మోషే ఇలా చెప్పాడు.
 
“యెహోవా బెన్యామీనును ప్రేమిస్తున్నాడు.
బెన్యామీను ఆయన చెంత క్షేమంగా జీవిస్తాడు.
అతనిని యెహోవా ఎల్లప్పుడూ కాపాడతాడు.
మరియు యెహోవా అతని దేశంలో నివసిస్తాడు.”* మరియు … నివసిస్తాడు అక్షరాల అతడు ఆయన భుజాల మధ్య జీవిస్తాడని అర్థం. యెహోవా ఆలయం బెన్యామీను, యూదా వారి సరిహద్దుల మధ్య ఉంటుందని కావచ్చు.
యోసేపుకు ఆశీర్వాదాలు
13 యోసేపును గూర్చి మోషే ఇలా చెప్పాడు:
 
“యెహోవా అతని దేశాన్ని ఆశీర్వదించును గాక.
ఆకాశం నుండి శ్రేష్ఠమైన వాటితో
భూమి క్రింద దాగి ఉన్న లోతైన ధన సంపదతో
14 సూర్యుని శ్రేష్ఠఫలాలతో
మాసాల శ్రేష్ఠపంటలతో
15 ప్రాచీన పర్వతాల నుండి శ్రేష్ఠఫలాలంతో
కొండల్లో శాశ్వతంగా ఉంచబడే శ్రేష్ఠ పదార్థాలతో
16 భూమి నుండి శ్రేష్ఠమైన బహుమానాలు, దాని పూర్ణ ఆశీర్వాదాలతో,
మండుతూ ఉండే పొదలో నివాసం చేసే యెహోవా కటాక్షంతో,
తన సోదరులనుంచి వేరుగా వించబడ్డ యోసేపు తలమీద యోసేపు నడి నెత్తి మీద ఆశీర్వాదం వచ్చునుగాక.
17 యోసేపు దొడ్డిలో మొట్టమొదట పుట్టిన ఎద్దుకు ఎంతో శోభ,
ఈ ఎద్దు కొమ్ములు అడవి దున్నపోతు కొమ్ములంత పెద్దవిగా ఉంటాయి.
యోసేపు మందలు మనుష్యుల్ని తోసివేస్తాయి. అందర్నీ,
భూదిగాంతాల వరకు తోసివేస్తాయి.
అవును, మనుష్షేకు వేలాది మంది ప్రజలు ఉన్నారు,
అవును, ఎఫ్రాయిముకు పది వేలమంది ప్రజలు ఉన్నారు.”
జెబూలూనుకు ఆశీర్వాదాలు
18 జెబూలూను గూర్చి మోషే చెప్పినది:
 
“జెబూలూనూ, నీవు బయటకు వెళ్లినప్పుడు,
ఇశ్శాఖారూ, నీ యింటివద్ద నీ గుడారాలలో సంతోషంగా ఉండు.
19 వారు తమ ప్రజలను కొండకు (కర్మెలు) పిలుస్తారు.
అక్కడ వారు సరెన బలులు అర్పిస్తారు.
ఎందుకంటే, సముద్రాల్లోని సమృద్ధిని వారు తీసుకొంటారు.
ఇసుకలో దిగి ఉన్న ఐశ్వర్యాలను మీరు తీసుకుంటారు గనుక.”
గాదుకు ఆశీర్వాదాలు
20 గాదును గూర్చి మోషే ఇలా చెప్పాడు:
 
“గాదును విశాలపర్చే దేవునికి స్తోత్రాలు!
గాదు సింహంలా పడుకుంటాడు,
చేతిని, నడినెత్తిని చీల్చేస్తాడు.
21 శేష్ఠభాగం అతడు తనకోసం ఎంచుకుంటాడు
అక్కడ రాజభాగం అతనికి ఉంచబడుతుంది.
ప్రజానాయకులు అతని దగ్గరకు వస్తారు ఇశ్రాయేలీయుల యెడల అతడు దయ చూపుతాడు.
యెహోవా దృష్టికి మంచివాటిని అతడు చేస్తాడు
యెహోవా అతని పక్షంగా తీర్పుతీరుస్తాడు.”
దానుకు ఆశీర్వాదాలు
22 దాను గూర్చి మోషే ఇలా చెప్పాడు:
 
“దాను బాషాను నుండి దూకే సింహపు పిల్ల.”
నఫ్తాలీకి ఆశీర్వాదాలు
23 నఫ్తాలీ గూర్చి మోషే ఇలా చెప్పాడు.
 
“నఫ్తాలీ, నీవు దయపొంది తృప్తిగా ఉన్నావు,
యెహోవా ఆశీర్వాదాలతో నిండిపోయావు,
(గలలీ) పశ్చిమ, దక్షిణాల భూమిని నీవు తీసుకో.”
ఆషేరుకు ఆశీర్వాదాలు
24 ఆషేరును ఆషేరు దీని అర్థం ధన్యుడు లేక సంతోషం. గూర్చి మోషే ఇలా చెప్పాడు:
 
“కుమారులలో ఆషేరు అత్యధికంగా ఆశీర్వదించబడినవాడు;
అతణ్ణి తన సోదరులకు ప్రియ మైన వాడ్నిగా ఉండనియ్యుండి.
అతణ్ణి తన పాదాలు తైలముతో కడుగ కోనివ్వండి.
25 నీ తాళాలు యినుపవి, యిత్తడిని,
నీ బలం జీవితం అంత ఉంటుంది.”
మోషే దేవుణ్ణి స్తుతించుట
26 “ఓ యెషూరూనూ, దేవునివంటి వాడు ఎవ్వరూ లేరు.
దేవుడు తన మహిమతో నీకు సహాయం చేసేందుకు.
మేఘాల మీద ఆకాశంలో విహరిస్తాడు.
27 నిత్యుడైన దేవుడు
నీకు భద్రతా స్థలం
శాశ్వతంగా ఆదుకునే హస్తాలు
నీక్రింద ఉన్నాయి.
దేవుడు శత్రువును నీదగ్గర నుండి వెళ్లగొట్టేస్తాడు.
‘శత్రువును నాశనం చేయి’ అంటాడు.
28 కనుక ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తాడు,
ధాన్యం, ద్రాక్షారసం ఉండే దేశంలో
యూకోబు ఊటక్షేమంగా ఉంటుంది.
అవును, అతని ఆకాశం మంచును కురిపిస్తుంది.
29 ఇశ్రాయేలూ, నీవు సంతోషంగా ఉన్నావు.
యెహోవా చేత రక్షించబడిన దేశంగా నీవలె ఏ దేశమూ లేదు.
యెహోవాయే నీకు సహాయం చేసేవాడు.
నీ విజయానికి యెహోవాయే ఖడ్గం.
నీ శత్రువులు నీకు విధేయులై వస్తారు.
వారి అబద్ధపు దేవతం పూజా స్థలాల
మీద మీరు నడుస్తారు.”

*33:5: యెషూరూనుకు ఇది ఇశ్రాయేలుకు మరో పేరు మంచివాడు లేక సత్యవంతుడు అని దీని అర్థం.

33:8: ఊరీము, తుమ్మీమునకు దేవుని నుండి తమ ప్రశ్నలకు జవాబులు పొందేందుకు యాజకులు వీటిని ఉపయోగిం చేవారు.

33:8: మస్సా … మెరీబా సంఖ్యాకాండము 20:1-13 చూడండి.

§33:10: యాకోబు ఇశ్రాయేలు యొక్క మరో పేరు.

*33:12: మరియు … నివసిస్తాడు అక్షరాల అతడు ఆయన భుజాల మధ్య జీవిస్తాడని అర్థం. యెహోవా ఆలయం బెన్యామీను, యూదా వారి సరిహద్దుల మధ్య ఉంటుందని కావచ్చు.

33:24: ఆషేరు దీని అర్థం ధన్యుడు లేక సంతోషం.