యెరూషలేమును కొలవటాన్ని గురించిన దర్శనం 
2
1 నేను పైకిచూశాను. వస్తువులను కొలవటానికి ఒకడు తాడు పట్టుకుని ఉన్నట్లు చూశాను. 
2 “నీవెక్కడికి వెళ్తున్నావు?” అని అతన్ని అడిగాను. 
“నేను యెరూషలేమును కొలవటానికి వెళ్తున్నాను. అది ఎంత వెడల్పు, ఎంత పోడవు వున్నదో చూడాలి”అని అతడు నాకు చెప్పాడు. 
3 అప్పుడు నాతో మాట్లాడుతున్న దేవదూత వెళ్లి పోయాడు. మరొక దేవదూత అతనితో మాట్లాడటానికి వెళ్లాడు. 
4 అతనితో ఇలా చెప్పాడు: “పరుగున పొమ్ము. వెళ్లి ఆ యువకునితో యెరూషలేము కొలవ లేనంత పెద్దగా పుంటుందని చెప్పు. అతనికి ఈ విషయూలు చెప్పు: 
‘యెరూషలేము ప్రాకారం లేని నగరంగా ఉంటుంది. 
ఎందుకంటే అక్కడ ఎంతోమంది మనుష్యులు, ఎన్నో జంతుపులు నివసిస్తాయి.’ 
5 యెహోవా చెపుతున్నాడు, 
‘యెరూషలేమును రక్షిస్తూ దానిచుట్టూ నేనొక అగ్ని గోడలా ఉంటాను. 
ఆ నగరానికి మహిమను కలుగజేస్తూ, నేనక్కడ నివసిస్తాను.’” 
దేవుడు తన ప్రజలను ఇంటికి పిలవటం 
6 యెహోవా ెచెపుతున్నాడు, 
“త్వరపడు! ఉత్తర దేశం నుండి పారిపొమ్ము! 
అవును. నీ ప్రజలను ప్రతి చోటికి నేను చెదర గొట్టిన మాట నిజమే. 
7 సీయోను ప్రజలారా మీరు బబులోనులో బందీలయ్యారు. కాని ఇప్పుడు తప్పించుకోండి! ఆ నగరం నుండి పారిపొండి!” సర్వశక్తిమంతుడైన యెహోవా నా గురించి ఈ విషయాలు చెప్పాడు: ఆ రాజ్యాలు యుద్ధంలో నీనుండి వస్తువులు తీసుకున్నారు. 
8 ఆ రాజ్యాలు ఘనత సంపాదించాయి. 
కాని ఆ తరువాత యెహోవా నన్ను వారి మీదికి పంపుతాడు. 
ఎందుకంటే, మీకు హాని కలిగించడమంటే, దేవుని కంటిపాపలకు హాని కలిగించడమే అవుతుంది. 
అప్పుడు ఆ రాజ్యాలు వాటి గౌరవాన్ని పొందుతాయి. 
9 మరియు నేనా ప్రజలను బాధిస్తాను. 
వారి బానిసలు వారి ధనాన్ని తీసుకుంటారు. 
బబులోను ప్రజలు నా ప్రజలను బంధించి వారిని బానిసలుగా చేశారు. 
కాని నేను వాళ్లను దెబ్బ తీస్తాను వారు నా ప్రజలకు బానిసలపుతారు. 
అప్పుడు సర్వశక్తి మంతుడైన యెహోవాయే నన్ను 
పంపినట్టు మీరు తెలుసుకుంటారు. 
10 యెహోవా చెపుతున్నాడు: 
“సీయోనూ, సంతోషంగా పుండు! ఎందుకంటే, నేను వస్తున్నాను. 
మరియు నేను నీ నగరంలో నివసిస్తాను. 
11 ఆ సమయంలో అనేక దేశాల ప్రజలు 
నా వద్దకు వస్తారు. 
పైగా వారు నా ప్రజలవుతారు. 
నేను నీ నగరంలో నివసిస్తాను.” 
సర్వశక్తిమంతుడైన యెహోవా నీ వద్దకు 
నన్ను పంపాడని నీవు తెలుసుకుంటావు. 
12 యెహోవా మళ్లీ యెరూషలేమును తన ప్రత్యేక నగరంగా ఎంపిక చేస్తాడు. 
మరియు యూదా పవిత్ర భూమిలో తన భాగంగా ఉంటుంది. 
13 ప్రతి ఒక్కడూ ప్రశాంతంగా ఉండాలి! 
యెహోవా తన పవిత్ర నివాసం నుండి వస్తున్నాడు.